హైదరాబాద్, మే 30: బెంగళూరు నుంచి నాగ్‌పూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం శనివారం శంషాబాద్‌లోని Rajiv Gandhi International Airportలో అత్యవసరంగా దిగింది.
విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించిన పైలట్ వెంటనే ఆర్జీఐఏ అధికారులకు సమాచారం ఇచ్చారు. అత్యవసర ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు.
ఆ సమయంలో విమానంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనపై అధికారులు అవసరమైన తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

