బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీకే శివకుమార్‌ను సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ఆయన పేరుకు మద్దతు తెలపడంతో శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు.
సీఎల్పీ నేతగా ఎన్నిక కావడంతో డీకే శివకుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జూన్ 3న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. లోక్ భవన్‌లోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పండితులు సూచించిన ముహూర్తం ఆధారంగా జూన్ 3 తేదీని డీకే శివకుమార్ ఖరారు చేసినట్లు సమాచారం.

