విజయవాడలో మెగా సందడి.. నేడు ‘పెద్ది’ ప్రీ రిలీజ్ వేడుక

June 1, 2026 3:45 PM

విజయవాడ: విజయవాడలో నేడు ‘పెద్ది’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. బెజవాడ గడ్డపై ఇప్పటికే మెగా సందడి మొదలైంది. కోస్తా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు విజయవాడకు చేరుకుంటున్నారు.

ఈ నెల 4న ‘పెద్ది’ సినిమా విడుదల కానుంది. విడుదలకు ముందు నిర్వహిస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతుండటంతో ఉత్సాహం మరింత పెరిగింది.

రామ్‌చరణ్‌, పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై కనిపించనుండటం మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. అదే వేడుకలో జాన్వీ కపూర్‌ కూడా పాల్గొననుండటంతో అభిమానుల రాక మరింత పెరిగింది.

భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం జరిగే ప్రాంగణం పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media