బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు. నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో బాల్క సుమన్ అరెస్ట్, అతడిపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై విచారణ జరిగింది. బాల్క సుమన్‌పై మొత్తం 3 సెక్షన్లు నమోదు చేయగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే సెక్షన్ వర్తించదని విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో 2 సెక్షన్లు మాత్రమే బాల్క సుమన్‌కు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో దేశద్రోహం సెక్షన్‌ను కూడా బాల్క సుమన్‌పై పోలీసులు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని రాజద్రోహం సెక్షన్ 152ను కూడా పోలీసులు జోడించారు. బాల్క సుమన్‌పై కేసులో 2 సెక్షన్లు మాత్రమే వర్తిస్తాయని కోర్టు వెల్లడించింది. అతడిపై నమోదు చేసిన మిగిలిన సెక్షన్లను నాంపల్లి కోర్టు తొలగించింది.

