శ్రీవారి సేవలో జాన్వీ కపూర్

June 4, 2026 11:28 AM
janvi kapoor tirumala

రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన సినిమా ‘పెద్ది’. థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముదురు రంగు పట్టుచీర కట్టుకుని సంప్రదాయబద్ధంగా కనిపించింది. కాలినడకన జాన్వీ తిరుమల చేరుకుంది. అలిపిరి మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకునుని మొక్కులు చెల్లించుకుంది జాన్వీ. జాన్వీతో పాటు సీనియర్ నటి, ‘గులాబీ’ ఫేమ్ మహేశ్వరి కూడా పాల్గొన్నారు.

‘పెద్ది’ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media