Khammam జిల్లాలో ప్రమాదం.. ఏడుగురికి గాయాలు
నలుగురి పరిస్థితి విషమం
Khammam, జూన్ 9: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రైల్వే వంతెనను ఢీకొట్టి పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
KVR ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చెక్కపల్లి పట్టణం నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. ప్రయాణంలో కొత్త లంకపల్లి సమీపానికి చేరుకున్న సమయంలో రైల్వే వంతెనను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి బస్సు ముందు యాక్సిల్ విడిపోయి, వాహనం పక్కకు ఒరిగిపోయింది.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. బస్సు అధిక వేగంతో వెళ్తుండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

