ఉదయం 11:30కు విడుదల
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ Inter supplementary ఫలితాలపై విద్యార్థుల ఎదురుచూపులు
హైదరాబాద్: తెలంగాణ Inter supplementary పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కు సంబంధించిన సప్లిమెంటరీ ఫలితాలు ఒకేసారి అందుబాటులోకి రానున్నాయి. జనరల్ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కూడా తమ ఫలితాలను చూసుకునే అవకాశం ఉంటుంది. ఫలితాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.
మార్కులు మెరుగుపర్చుకునేందుకు పరీక్షలు
ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులతో పాటు తక్కువ మార్కులు వచ్చిన వారు మార్కులు పెంచుకునేందుకు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఈ పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు తమ తదుపరి విద్యా ప్రణాళికలపై నిర్ణయం తీసుకునే అవకాశం లభించనుంది.
Also read,



