వర్షం తర్వాత చెట్ల కొమ్మలు తొలగిస్తుండగా ప్రమాదం
Alwal లో విషాదం..విద్యుత్ తీగలు తెగిపడి ఉండొచ్చని పోలీసుల అనుమానం
హైదరాబాద్: Alwal లోని టెలికాం కాలనీలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై తండ్రీకూతురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టెలికాం కాలనీలో నివసిస్తున్న సందీప్ (44), ఆయన కుమార్తె రితిక (16) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల వారి ఇంటి బయట రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు వాటిని తొలగించే పనిలో ఉన్నారు. ఈ సమయంలో సందీప్, రితిక విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలారు. ఇద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు.
ఈ ఘటనలో సందీప్ భార్యకు కాలిన గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడిపోయి ఉండొచ్చని, వాటిని తాకడంతో తండ్రీకూతురు విద్యుదాఘాతానికి గురయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read,



