రూ 15.15 లక్షల కోట్ల మాయాజాలం… సెబీ కళ్లకు గంతలు.. సామాన్య ఇన్వెస్టర్ గుండెకోతకు బాధ్యులెవరు?

July 9, 2026 3:33 PM
Rajesh Exports case raises concerns over investor protection.

మిడిల్ క్లాస్ ప్రజలు తమ పిల్లల పెళ్లిళ్ల కోసమో, రిటైర్మెంట్ కోసమో కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే.. చివరకు మిగిలింది ఘోరమైన గుండెకోత మాత్రమే. దేశంలోనే బిగ్గెస్ట్ కార్పొరేట్ స్కామ్‌కు తెరలేపిన బెంగళూరు బేస్డ్ గోల్డ్ దిగ్గజం రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఉదంతం చూశాక, సామాన్యుడికి సిస్టమ్స్ మీద ఉన్న నమ్మకం పూర్తిగా కొట్టుకుపోయింది.

రూ 15.15 లక్షల కోట్ల అకౌంటింగ్ గోల్‌మాల్‌తో ఈ గోల్డ్ ఎంపైర్ సృష్టించిన మాయాజాలం అంతా ఇంతా కాదు. 1980ల్లో కేవలం రూ1,200 అప్పుతో, ఒక చిన్న గదిలో మొదలైన రాజేష్ మెహతా ప్రస్థానం, నెక్స్ట్ లెవెల్‌లో ఎదుగుతూ 2015లో రూ 3,800 కోట్ల ఆల్-క్యాష్ డీల్‌తో వరల్డ్ ఫేమస్ స్విస్ రిఫైనరీ వాల్కంబి (Valcambi)ని కొనే రేంజ్‌కు చేరింది. ఇండియాకే తిరుగులేని గోల్డ్ కింగ్‌గా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ క్రేజీ హైప్ క్రియేట్ చేసింది. కానీ, 2021 నుండి 2025 మధ్య కాలంలో కంపెనీ చూపించిన టోటల్ రెవెన్యూలో దాదాపు 99.80శాతం కేవలం కాగితాల మీద, ల్యాప్‌టాప్ స్క్రీన్లపై క్రియేట్ చేసిన ఫేక్ నంబర్స్ అని సెబీ ప్రాథమికంగా తేల్చడంతో ఈ సామ్రాజ్యం ఒక్కసారిగా కొలాప్స్ అయింది.

మార్చి 2024లో ఒక అలర్ట్ షేర్‌హోల్డర్ ఇచ్చిన కంప్లైంట్‌తో సీన్ లోకి వచ్చిన సెబీ, ఫోరెన్సిక్ ఆడిటర్ బీడీవోను రంగంలోకి దించింది. ఆడిటర్లు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ రికార్డులను, వారి స్విస్ సబ్సిడియరీ వాల్కంబి రికార్డులతో క్రాస్-చెక్ చేసినప్పుడు అసలు పిక్చర్ బయటపడింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ బుక్స్ లో తన గ్రూప్ ఆదాయంలో 97శాతం నుండి 99శాతం విదేశీ అనుబంధ సంస్థల నుంచే వస్తోందని బిల్డప్ ఇస్తే, KPMG ఆడిట్ చేసిన వాల్కంబి ఒరిజినల్ ఐదేళ్ల స్టాండ్‌అలోన్ రెవెన్యూ కేవలం రూ3,027 కోట్లు మాత్రమేనని తేలింది.

ఈ మైండ్ బ్లోయింగ్ గ్యాపే ఈ శతాబ్దపు బిగ్గెస్ట్ అకౌంటింగ్ ఫ్రాడ్‌కు మెయిన్ ప్రూఫ్. పైగా కంపెనీ చైర్మన్ రాజేష్ మెహతా, సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ అఫ్లుయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ ద్వారా ఒకే రోజు రూ 11,487 కోట్ల విలువైన గోల్డ్ డెరివేటివ్స్ సేల్ చేసి, మళ్లీ రూ 11,488 కోట్లకు బై చేసినట్లు బుక్స్ రాసుకున్నారు. తీరా సెబీ అడిగితే, అసలు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ మా క్లయింటే కాదు, అసలు ఇలాంటి ట్రాన్సాక్షన్లే జరగలేదు అని అఫ్లుయెన్స్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీనికి రాజేష్ మెహతా మాత్రం, మేము 400 GB డేటా ఇస్తే, ఆ బల్కీ డేటా చదవడం చేతకాక SEBI అధికారులే కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్లకు టర్నోవర్‌కు మార్జిన్‌కు తేడా తెలియడం లేదు అంటూ క్రేజీగా బ్లేమ్ గేమ్ ఆడారు.

ఈ ఇష్యూ అంతా నడుస్తుండగానే, జూన్ 2026లో సెబీ ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేయడంతో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్ వాల్యూ ఘోరంగా క్రాష్ అయింది. ఒకప్పుడు రూ 1,028 పలికిన షేరు, 5శాతం లోయర్ సర్క్యూట్లతో కొట్టుకుంటూ ఏకంగా రూ 80కి పడిపోయింది. దీనివల్ల లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఏకంగా 90శాతం పైగా ఇన్వెస్టర్ వెల్త్ మాయమవ్వగా, రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు LIC లాంటి బిగ్గెస్ట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నిలువునా మునిగిపోయాయి. ఇక్కడే జనాలు సెబీని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. ఐదేళ్లపాటు ఒక కంపెనీ లక్షల కోట్ల ఫేక్ లెక్కలు చూపిస్తుంటే, మార్కెట్ వాచ్‌డాగ్ నిద్రపోతోందా? క్వార్టర్లీ రిపోర్ట్స్ ని కేవలం పోస్ట్‌మ్యాన్‌లా రిసీవ్ చేసుకుని ఫైల్స్ లో దాచేస్తారా? దాదాపు 20 నెలల పాటు ఇన్వెస్టిగేషన్ సాగదీసి, ఇప్పుడు హడావిడిగా ఎక్స్-పార్టీ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల, ఈ గ్యాప్ లో స్మార్ట్ ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు తమ ఫండ్స్ ని సేఫ్ ప్లేస్ లోకి షిఫ్ట్ చేసుకోవడానికి సెబీనే పరోక్షంగా టైమ్ ఇచ్చినట్లయింది. ప్రమోటర్ ని మార్కెట్ నుంచి తాత్కాలికంగా బ్యాన్ చేయడం, రికార్డులు సరిచేసుకోమనడం కంటితుడుపు చర్యే. ఆస్తుల జప్తు, క్రిమినల్ అరెస్టులు లేకపోతే ఎలా?

యూఎస్ లో ‘సార్బేన్స్-ఆక్స్లీ యాక్ట్’ ప్రకారం కార్పొరేట్ మోసాలకు 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది, బ్రిటన్ లో నిమిషాల వ్యవధిలో అసెట్స్ ఫ్రీజ్ చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు. కానీ మన దేశంలో రూ15.15 లక్షల కోట్ల అగాధం కనిపిస్తున్నా, రెగ్యులేటర్లు కేవలం నోటీసులు ఇవ్వడం, సహకరించడం లేదు అని ప్రెస్ నోట్లు వదలడంతోనే సరిపెడుతున్నారు. సెబీ ఎప్పుడూ పోస్ట్-మార్టం లాగే చేస్తోంది తప్ప, ముందే ఆపే ప్రివెంటివ్ మైండ్ సెట్ తో ఉండటం లేదు.

సత్యం కంప్యూటర్స్ నుండి నేటి రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వరకు ప్రతిసారీ రిటైల్ ఇన్వెస్టర్లు రోడ్డున పడ్డాకే సిస్టమ్ అలర్ట్ అవుతోంది. ఇకనైనా సెబీ ఈ నోటీసుల డ్రామా ఆపి, తప్పు చేసిన కార్పొరేట్ తిమింగలాల పర్సనల్ అసెట్స్ అటాచ్ చేసి, కఠినమైన క్రిమినల్ సెక్షన్ల కింద జైలుకు పంపాలి. అలాగే ఇన్వెస్టిగేషన్ లేట్ చేసిన అధికారులపై కూడా యాక్షన్ తీసుకుంటేనే మార్కెట్ పై నమ్మకం ఉంటుంది. లేదంటే, ఇండియన్ స్టాక్ మార్కెట్ సామాన్యుడి పాలిట కేవలం ఒక లీగల్ క్యాసినో లాగా మిగిలిపోవడం ఖాయం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media