అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో నిర్ణయం
అమెరికా పర్యటన రద్దు
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న CM Revanth Reddy ఈనెల 23న అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇందుకు సంబంధించి టూర్ షెడ్యూల్ కూడా సిద్ధమైంది.
అయితే అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వలేదు.
దీంతో అమెరికా పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేసుకున్నారు.
ఆగస్టు 23న లండన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచే హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
లండన్‌లో సీఎం షెడ్యూల్
రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
అక్కడి నుంచి నేరుగా లండన్ పర్యటనకు వెళ్లారు.
శుక్రవారం ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను ఆయన సందర్శించనున్నారు.
సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్‌బాల్ ప్రజంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు.
ఆగస్టు 22న కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం కానున్నారు.
అనంతరం లండన్‌లో పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
కేంద్రం అనుమతి ఎందుకు ఇవ్వలేదు?
ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలి.
లండన్, అమెరికా పర్యటనలకు అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లండన్ పర్యటనకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావాల్సి వచ్చింది.
ఆగస్టు 23న లండన్ నుంచే ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.



