ఎల్ నినో ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం మామూలుగా లేదుగా?

August 27, 2026 2:38 PM

ఎల్ నినో ప్రభావం.. పెరుగుతున్న ఆందోళన

ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్ నినో అంటారు.

తాజా అంచనాల ప్రకారం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 3.6 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.

1877లో అత్యధికంగా నమోదైన 2.75 డిగ్రీల రికార్డును కూడా ఈ తీవ్ర ఎల్ నినో పరిణామాలు అధిగమించే పరిస్థితి కనిపిస్తోంది.

దీంతో దేశ వ్యవసాయ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ వర్షపాతం ఇప్పటికే వ్యవసాయంపై ప్రభావం చూపుతోంది.

రుతుపవనాలు అనుకున్న స్థాయిలో లేకపోతే కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలో రానున్న 24 గంటల్లో వానలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది.

దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణలోనూ వర్షాలు

తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు

సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు.

సాగునీటి విడుదలకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

దీంతో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

సాగునీటి లభ్యతపై స్పష్టత లేకుండా పంటలు వేసుకుని నష్టపోవద్దని రైతులను హెచ్చరిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media