భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్.. నల్గొండలో హైటెన్షన్

September 1, 2026 11:30 AM

కోడిగుడ్ల దాడితో మొదలైన వివాదం

నల్గొండ పట్టణంలో కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంపై భాజపా శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేశాయి.

దీనికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగాయి.

ఈ పరస్పర దాడులతో నల్గొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాంగ్రెస్, భాజపా మధ్య వివాదం మరింత ముదిరింది.

వర్షిత్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన రామచందర్ రావు

వర్షిత్ రెడ్డి నివాసంలో జరిగిన దాడిని పరామర్శించేందుకు భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. బాధితులను పరామర్శించి వారికి సంఘీభావం తెలిపేందుకు ఆయన నల్గొండకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అయితే రామచందర్ రావును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

నల్గొండలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారని భాజపా ఆగ్రహం

రామచందర్ రావు అరెస్ట్‌పై భాజపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న తమ రాష్ట్ర అధ్యక్షుడిని అడ్డుకోవడం సరికాదని భాజపా నేతలు అంటున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, నిరంకుశంగా వ్యవహరిస్తోందని భాజపా నేతలు మండిపడుతున్నారు.

మరోవైపు పరిస్థితులు చేయిదాటకుండా నల్గొండ వ్యాప్తంగా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media