ప్రమాదం నుంచి బయటపడేందుకు కొత్త మార్గం: UN
పారిస్ ఒప్పందం లక్ష్యాన్ని దాటనున్న ప్రపంచం
UN: వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి కీలక నివేదికను విడుదల చేసింది. Global Warming త్వరలోనే 1.5°C పరిమితిని దాటుతుందని UN Environment Programme (UNEP) తెలిపింది. 2015 పారిస్ వాతావరణ ఒప్పందంలో నిర్దేశించిన ఈ పరిమితిని ఇక పూర్తిగా కాపాడటం సాధ్యం కాదని నివేదిక స్పష్టం చేసింది.
ముందుగా పెరుగుదలను అడ్డుకోవాలి.. ఆ తర్వాత ఉష్ణోగ్రత తగ్గించాలి
ప్రపంచం ఇక పరిస్థితిని వదిలేయకుండా.. ఉష్ణోగ్రతలు ఎంతవరకు పెరుగుతాయో ఆ స్థాయిని వీలైనంత తక్కువగా ఉంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ తర్వాత భూతాపాన్ని క్రమంగా 1.5°C కంటే దిగువకు తీసుకురావడానికి ప్రయత్నించాలి. దీనిని ‘overshoot’ వ్యూహంగా నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం 1.4°C వద్ద ప్రపంచ ఉష్ణోగ్రత
కొంతమంది శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం.. పారిశ్రామికీకరణకు ముందు స్థాయితో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత ఇప్పటికే 1.4°C పెరిగింది. అయితే 1.5°C పరిమితిని ఒక ఏడాది ఉష్ణోగ్రత ఆధారంగా కాకుండా 20 ఏళ్ల సగటుతో లెక్కిస్తారు.
ఇప్పటివరకు 1.5°C లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని UN అధికారులు చెబుతూ వచ్చారు. అయితే తాజా నివేదికలో ప్రపంచం “తదుపరి కొన్ని సంవత్సరాల్లో” ఆ పరిమితిని దాటుతుందని తొలిసారిగా స్పష్టంగా అంగీకరించారు.
UNEP నివేదిక ప్రకారం.. దేశాలు అత్యంత కఠినమైన వాతావరణ లక్ష్యాలను అమలు చేస్తే భూతాపం శతాబ్దం మధ్యలో గరిష్ఠంగా 1.8°C వద్ద ఆగే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుత ప్రభుత్వ విధానాలు కొనసాగితే 2100 నాటికి ఉష్ణోగ్రతలు 2.6°C వరకు పెరిగే ప్రమాదం ఉంది.
“1.5°C లక్ష్యం ఇంకా ఉంది.. కానీ విధానం మార్చాలి”
“మానవాళి వాతావరణ విపత్తును నివారించే పరిమితిని వేగంగా దాటుతోంది” అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి António Guterres అన్నారు.
“1.5 లక్ష్యం ఇప్పటికీ ఉంది. కానీ ఇప్పుడు దాన్ని పై నుంచి చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అని UNEP Executive Director Inger Andersen చెప్పారు.
University of Victoria వాతావరణ శాస్త్రవేత్త Andrew Weaver మాట్లాడుతూ.. 1.5°C అనేది “ఏదో ఒక మాయాజాల వాతావరణ అంచు” కాదని చెప్పారు. ప్రతి 0.1°C పెరుగుదలను తగ్గించినా నష్టం తగ్గుతుందని వివరించారు.
మరిన్ని దశాబ్దాల పాటు వాతావరణ ముప్పు
ప్రపంచం 1.5°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల కాలంలో “చాలా, చాలా దశాబ్దాలు” ఉండే అవకాశం ఉందని నివేదిక సహ రచయిత Richard Betts చెప్పారు.
ఉద్గారాలను తగ్గించడంలో ప్రతి ఐదేళ్ల ఆలస్యం గరిష్ఠ భూతాపాన్ని కనీసం మరో 0.1°C పెంచుతుందని Imperial College London వాతావరణ శాస్త్రవేత్త Joeri Rogelj చెప్పారు.
వాతావరణ మార్పుల ప్రభావాలు పేద దేశాలు, పేద ప్రజలపై మరింత తీవ్రంగా పడతాయని UN తెలిపింది.
పెరుగుతున్న వేడి, తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా మరణాలు, అనారోగ్యాలు పెరగొచ్చు. ఆహార ఉత్పత్తి తగ్గి ఆకలి సమస్య పెరగొచ్చు. నీటి కొరత తీవ్రమవుతుంది. ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం పడుతుంది.
పర్యావరణ వ్యవస్థలకు భారీ ముప్పు
వాతావరణ మార్పుల కారణంగా పగడపు దిబ్బలు (coral) వంటి జీవ వ్యవస్థలు అంతరించిపోయే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.
అలాగే West Antarctic, Greenland మంచు పలకలు కరిగిపోవడం, Amazon rain forest నష్టపోవడం, యూరప్‌కు వెచ్చదనాన్ని అందించే Atlantic Ocean circulation system ఆగిపోవడం వంటి ‘tipping points’ సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంది.
ఇలాంటి మార్పులు ఒకసారి జరిగితే వాటిని తిరిగి మార్చడం చాలా కష్టమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు భీమా చేయడానికి అనుకూలంగా లేకపోవచ్చు. మరికొన్ని ప్రాంతాలు భవిష్యత్తులో నివసించడానికి కూడా అనువుగా లేకపోవచ్చని UN నివేదిక తెలిపింది.
కార్బన్ తొలగింపే చివరి దశ
భూతాపాన్ని మళ్లీ తగ్గించాలంటే వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను తొలగించి నిల్వ చేయాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.
ఇందులో సంప్రదాయంగా చెట్లను పెంచే విధానాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే చెట్ల పెంపకం ద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతను గరిష్ఠంగా 0.1°C వరకు మాత్రమే తగ్గించగలమని నివేదిక పేర్కొంది. అందుకే మరింత ఆధునిక కార్బన్ తొలగింపు పద్ధతులు అవసరమని శాస్త్రవేత్తలు చెప్పారు.
అయితే ఈ విధానాలు ఖరీదైనవి, నమ్మదగినవి కావని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
Stanford University వాతావరణ శాస్త్రవేత్త Rob Jackson మాట్లాడుతూ.. “1.5°C భూతాపాన్ని నివారించేందుకు ప్రపంచ ఉద్గారాల పెరుగుదలను ఆపలేకపోయాం. ఇప్పుడు overshoot పరిస్థితుల్లో ఆ పెరుగుదలను త్వరగా ఆపి, ఉష్ణోగ్రతలను తిరిగి తగ్గించాల్సి ఉంది. ఇది మనకు ఉన్న ఉత్తమ ఆశ కావచ్చు. కానీ ఇది జరిగే అవకాశం మాత్రం చాలా తక్కువ” అని అన్నారు.



