Telengana నిజామాబాద్‌లో దొంగ నోట్ల కలకలం

December 19, 2025 6:44 PM

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో భారీగా నకిలీ నోట్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఒక రైతు బ్యాంకులో క్రాప్ లోన్ కట్టేందుకు తెచ్చిన డబ్బులో ఏకంగా రూ. 2 లక్షలకు పైగా నకిలీ నోట్లు ఉండటంతో అధికారులు అవాక్కయ్యారు.

జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న సాయిలు. చిన్న సాయిలు తన క్రాప్ లోన్ చెల్లించడానికి రూ. 2,08,500 నగదుతో కెనరా బ్యాంకుకు వెళ్ళాడు. క్యాషియర్ ఆ నోట్లను కౌంటింగ్ మెషీన్‌లో వేయగా, అందులోని 417 నోట్లు (అన్నీ 500 రూపాయలవే) నకిలీవిగా తేలాయి. మొత్తం 2 లక్షల 8 వేల 500 రూపాయలు పూర్తిగా నకిలీవని తేలడంతో బ్యాంకు వర్గాలు షాక్‌కు గురయ్యాయి. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు వర్ని ఎస్ఐ రాజు కేసు నమోదు చేశారు. ఆ రైతుకు ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? దీని వెనుక ఉన్న నకిలీ నోట్ల ముఠా ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media