చైనా మాంజా అమ్మేవారిని పట్టిస్తే రూ. 5 వేలు MLA దానం నాగేందర్

December 29, 2025 2:09 PM

సంక్రాంతి పండుగ వేళ చైనా మాంజా విక్రయాలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉక్కుపాదం మోపారు. నిషేధిత చైనా మాంజా విక్రయించే వారి సమాచారం ఇస్తే రూ. 5 వేల నగదు బహుమతి అందజేస్తానని ఆయన ప్రకటించారు.

ఈ మాంజా వల్ల వాహనదారులు, ముఖ్యంగా అమాయక పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని దానం నాగేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఖైరతాబాద్ నియోజకవర్గంలో చైనా మాంజా అమ్మే షాపుల గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.సమాచారం అందిన వెంటనే సదరు విక్రయదారులపై కేసులు నమోదు చేయించి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా మాంజా విక్రయాల గురించి సమాచారం ఇచ్చే పౌరులకు తన సొంత నిధుల నుండి రూ. 5 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తానని స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media