అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి) 10,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. అంతకుముందు మిథాలీ రాజ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని చేరుకున్న పదో మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచారు.టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 10,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు భారత మహిళల క్రికెట్‌లో దిగ్గజ క్రీడాకారిణి మిథాలీ రాజ్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు మంధాన ఆ అరుదైన జాబితాలో చేరారు. కేవలం 231 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును చేరుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన 10వ మహిళా క్రికెటర్‌గా మంధాన నిలిచారు.
