నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మొత్తం నేరాల సంఖ్య 15 శాతం తగ్గిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా ఆయన పలు కీలక గణాంకాలను పంచుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మరియు అత్యాధునిక సాంకేతికత వినియోగం వల్ల ఓవరాల్ క్రైమ్ రేటు 15% తగ్గింది.
ఈ ఏడాది 368 డ్రగ్స్ కేసులను నమోదు చేసి, దాదాపు రూ. 6.45 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోక్సో (POCSO) కేసులు మరియు గృహ హింస కేసులు పెరిగినప్పటికీ, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం వల్లే ఈ సంఖ్య పెరిగిందని సీపీ వివరించారు.నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరవ్యాప్తంగా జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని సజ్జనార్ స్పష్టం చేశారు.
మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు, రూ. 10,000 జరిమానా మరియు 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.
