AP దుర్గమ్మ అన్నదాన పథకానికి రూ. 1.11 లక్షల విరాళం

January 7, 2026 3:43 PM

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారి నిత్య అన్నదాన పథకానికి భక్తులు భారీ విరాళం అందజేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన కె. వెంకట సుదర్శన రావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ. 1,11,116/- విరాళాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) శీనానాయక్‌కు చెక్కు రూపంలో అందజేశారు.విరాళం అందించిన దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఈఓ వారికి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media