Amaravatiకి చట్టబద్ధత కల్పించండి: Amit షా కు CM CBN విన్నపం

January 8, 2026 12:11 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.అమరావతిని A.P రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని, దీనివల్ల పెట్టుబడులకు భరోసా కలగడంతో పాటు ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సీఎం విన్నవించారు.

జీ-రామ్-జీ (G-RAM-G) పథకం:

ఉపాధి హామీ స్థానంలో వచ్చిన కొత్త పథకంలో కేంద్ర, రాష్ట్ర నిధుల వాటా 60:40కి మారడం వల్ల ఏపీపై ఆర్థిక భారం పడుతుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం సహకారం కొనసాగించాలని, పోలవరం సహా ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిని సీఎం వివరించారు.రాష్ట్రంలో అమలువుతున్న సంక్షేమ పథకాలు, శాంతిభద్రతల అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media