కాకినాడ జిల్లా SP జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట సర్కిల్ పరిధిలోని మహిళా పోలీసులతో C.I YRK ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమం, గ్రామాల్లో భద్రత, నేరాల నియంత్రణపై C.Iపలు కీలక సూచనలు చేశారు.ప్రతి మహిళ, బాలిక తన ఫోన్‌లో ‘శక్తి యాప్’ డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించాలి. గృహ హింస, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్ అరికట్టడంతో పాటు యువతులు ‘లవ్ ట్రాప్’లో పడకుండా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి.
డ్రగ్స్ వద్దు బ్రో: గ్రామాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల ఉనికి లేకుండా చూడాలి. యువత మత్తుకు బానిస కాకుండా ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలి.
సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే నిఘా ఉంచాలి. అటవీ జంతువుల వేటకు విద్యుత్ వైర్లు వేయడం, నాటుబాంబులు వాడే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలి.ఈ కార్యక్రమంలో గండేపల్లి SI శివ నాగబాబు, జగ్గంపేట SI రఘునందన్ రావు, కిర్లంపూడి SIG. సతీష్ మరియు మహిళా పోలీసులు పాల్గొన్నారు
