AP:అంధ రచయిత్రి సాయిజ్యోతి నవల ఆవిష్కరించిన లోకేష్

January 17, 2026 3:36 PM

అంగవైకల్యం శరీరానికే కానీ ఆశయానికి కాదని నిరూపించిన మంగళగిరి రచయిత్రి చింతక్రింది సాయిజ్యోతిని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా అభినందించారు. ఉండవల్లి నివాసంలో సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని చెలిమి’ అనే నవలను మంత్రి శనివారం ఆవిష్కరించారు.


పుట్టుకతోనే అంధురాలైన సాయిజ్యోతి, మొబైల్‌లో వాయిస్ ఇన్‌పుట్ సాంకేతికతను వాడుకుంటూ అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె ‘మంచుతాకిన ప్రేమ’, ‘ఎవరు అతను’ వంటి నవలలతో పాటు ‘కవితాంజలి’ అనే కవితా సంపుటిని కూడా రచించారు. ప్రస్తుతం ఆమె నూతక్కి హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే, సామాజిక స్పృహ కలిగించే కథలను రాస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన సాయిజ్యోతి మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలీ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media