శ్రీకాకుళేశ్వరుని సేవలో చిత్రకళా దిగ్గజం PADMASRI S.V రామారావు

January 20, 2026 2:57 PM

అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన భారతీయ చిత్రకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్.వి. రామారావు మంగళవారం శ్రీకాకుళం గ్రామంలోని ఆంధ్ర మహావిష్ణువు (శ్రీకాకుళేశ్వరస్వామి) వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్, ఎంపీటీసీ తాడికొండ వెంకటేశ్వరరావు మరియు స్థానిక నేతలు రామారావును శాలువాతో ఘనంగా సత్కరించారు. 2001లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్న రామారావు, 1965లోనే “మోస్ట్ అవుట్‌స్టాండింగ్ ఆర్టిస్ట్ ఇన్ ది కామన్వెల్త్” అవార్డు పొందిన అరుదైన ఘనత సాధించారని మండలి వెంకట్రామ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాజుల శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన నేతలు మరియు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media