దళితులకు లేని భూమి.. ABN ఆంధ్రజ్యోతికి ఎలా ఇస్తారు?: BSP

January 20, 2026 3:21 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ మీడియా సంస్థలకు విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడాన్ని బహుజన సమాజ పార్టీ (BSP) తీవ్రంగా ఖండించింది. విశాఖపట్నం జిల్లా పరదేశిపాలెం ప్రాంతంలో ఆంధ్రజ్యోతి పత్రిక (ఆమోద పబ్లికేషన్స్) కోసం 74 సెంట్ల భూమిని కేటాయిస్తూ జారీ చేసిన G.O.Ms.No.492పై బీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరాంధ్రలో వేలాది మంది దళితులు, బడుగు బలహీన వర్గాలు నివాస స్థలాలు లేక ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం ప్రజా ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని బీఎస్పీ ఉత్తరాంధ్ర జోన్ ఇన్‌చార్జ్ పెదపెంకి శివప్రసాద్ రావు విమర్శించారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాల్సింది పోయి, హైకోర్టు ఆదేశాల సాకుతో విలువైన భూమిని ప్రైవేట్ సంస్థకు అప్పగించడం అన్యాయమని పేర్కొన్నారు.74 సెంట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పబ్లికేషన్స్‌కు ఇవ్వడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది బహుజనుల హక్కుల ఉల్లంఘన అని బీఎస్పీ స్పష్టం చేసింది.

BSP డిమాండ్లు:

ఆంధ్రజ్యోతికి భూమిని కేటాయిస్తూ ఇచ్చిన G.O.Ms.No.492ను వెంటనే రద్దు చేయాలి.

ఆ భూమిని నిరుపేద దళితులు, వెనుకబడిన వర్గాల ఇళ్ల స్థలాల కోసం వినియోగించాలి.

గతంలో జరిగిన భూకేటాయింపులపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలి.
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు మరియు న్యాయ పోరాటాలు చేస్తామని బీఎస్పీ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరణం తిరుపతి రావు, పి. కనక మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media