అక్రమ సంబంధం-నగదు మాయం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

January 21, 2026 11:34 AM

ఓ మహిళను మోసం చేసి, ఆమె నగదు కాజేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మృతురాలి బంధువులు, కులస్థులు తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది.

కరడ్ పల్లి గ్రామానికి చెందిన ఎంకి సునీత భర్త సాయిలు మూడేళ్ల క్రితం చనిపోయారు. అప్పటి నుండి అదే గ్రామానికి చెందిన బక్కని రాజయ్య ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సునీత అకౌంట్లో ఉన్న సుమారు రూ. 20 లక్షలను రాజయ్య కాజేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.2025 నవంబర్ 29న సునీత అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె కుమారుడు శశికాంత్ ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. రాజయ్య నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నరేష్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా డబ్బులు కాజేసిన రాజయ్యే కులస్థులపై ఎదురు ఫిర్యాదు చేయడం, పోలీసులు అతనికి మద్దతుగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు.

సునీత డబ్బులు కాజేసిన రాజయ్యపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి.

ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఎస్సై నరేష్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media