భీంగల్‌లో కాంగ్రెస్‌కు షాక్: BRS గూటికి వీడీసీ అధ్యక్షుడు నీలం రవి

January 21, 2026 11:47 AM

బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీంగల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, కీలక ప్రజాప్రతినిధులు ఆ పార్టీని వీడి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరారు.

భీంగల్ వీడీసీ (VDC) అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ నేతలు షవ్వ అశోక్, కర్నె నరేష్‌లు శుక్రవారం ఎమ్మెల్యే వేముల నివాసంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వేముల పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత పదేళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ వైఫల్యాలను నిరసిస్తూనే తాము పార్టీ మారుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసీ చౌటపల్లి రవి, మాజీ కౌన్సిలర్ బోదిరే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media