ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డిపై ఏసీబీ (ACB) అధికారులు విరుచుకుపడ్డారు. బుధవారం తెల్లవారుజాము నుంచే వరంగల్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి నివాసం, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కీలక డాక్యుమెంట్లు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.గతంలో ఒక ప్రైవేట్ పాఠశాల అనుమతి కోసం లంచం తీసుకుంటూ వెంకట్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ ఘటన తర్వాత ఆయన ఆస్తులపై నిఘా పెట్టిన ఏసీబీ, భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది.ప్రభుత్వ ఉద్యోగిగా తన సంపాదనకు మించి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో ఈ దాడులు జరుగుతున్నాయి.
