విశాఖలో ప్రైవేట్ AC బస్సులో చెలరేగిన మంటలు తప్పిన ప్రమాదం

January 22, 2026 5:21 PM

నగరంలోని తాటిచెట్ల పాలెం జంక్షన్ వద్ద గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులందరినీ త్వరితగతిన కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media