‘ఆపరేషన్ సిందూర్’కు తాను మద్దతు తెలపడంపై వస్తున్న విమర్శలను కాంగ్రెస్ MP శశి థరూర్ తిప్పికొట్టారు. శనివారం జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ, జాతీయ భద్రత విషయంలో పార్టీల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

ఆపరేషన్ సిందూర్‌పై తన స్టాండ్ విషయంలో క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని, ఇది తన సూత్రాలకు సంబంధించిన విషయమని థరూర్ పేర్కొన్నారు.
“దేశం అంతరిస్తే.. మనం ఎందుకు జీవించాలి?” అన్న జవహర్ లాల్ నెహ్రూ మాటలను గుర్తు చేస్తూ.. అంతర్జాతీయ వేదికలపై భారత్ వాణి వినిపించడం రాజకీయం కాదని వివరించారు.పార్లమెంట్‌లో తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలనే అనుసరించానని, కేవలం సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలు మాత్రమే బహిరంగంగా వ్యక్తపరిచానని స్పష్టం చేశారు.
2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి (26 మంది మృతి) ప్రతికారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్ పట్ల థరూర్ తన “హిట్ హార్డ్, హిట్ స్మార్ట్” అనే వ్యాసం ద్వారా ఆనాడే మద్దతు ప్రకటించారు.రాహుల్ గాంధీ తనను విస్మరించారనే వార్తలపై స్పందిస్తూ.. పార్టీలో విభేదాలు సహజమని, కానీ దేశ భద్రత విషయంలో అంతా ఒక్కటేనని ఆయన తేల్చి చెప్పారు.
.
