నెల్లూరు జిల్లాకు చెందిన నోమేష్ అనే విద్యార్థి తన అద్భుతమైన ప్రతిభతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు మరియు మువ్వన్నెల జెండాకు తనదైన శైలిలో నివాళులర్పించాడు.
కేవలం 21.43 సెకన్లలోనే 30 రూబిక్ క్యూబ్స్ సెట్ చేసి.. వాటిపై త్రివర్ణ పతాకం మరియు వీర జవాన్ల చిత్రపటం వచ్చేలా అమర్చాడు. చిన్నప్పటి నుండే ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని, మన ప్రాణాలను కాపాడుతున్న సైనికుల పట్ల గౌరవాన్ని పెంచుకోవాలని నోమేష్ పిలుపునిచ్చాడు.గతంలోనూ పలువురు ప్రముఖుల చిత్రాలను రూబిక్ క్యూబ్స్‌తో తయారు చేసి నోమేష్ ప్రశంసలు అందుకున్నాడు. తాజా ప్రదర్శనతో జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడు.ఈ చిన్నారి ప్రతిభను చూసి నెల్లూరు వాసులు మరియు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Rubik’s Cubeతో 21 సెకన్లలో జవాన్ల చిత్రపటం నెల్లూరు నోమేష్
