77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆమె, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆత్మార్పణలను గుర్తుచేస్తూ, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వేడుకలకు హాజరైన చిన్నారులకు జాతీయ జెండా విశేషాలను వివరించి, వారికి చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. పిల్లలు ఉన్నతంగా ఎదిగి దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని అనిత పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పోలీస్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
