AP:BCబిడ్డలు IASలుగా రాణించాలి.. గొల్లపూడిలో మంత్రి సవిత

January 28, 2026 10:49 AM

విజయవాడ (BNS): దేశ పాలనలో కీలకమైన సివిల్ సర్వీసెస్‌లో బీసీ యువత అధిక సంఖ్యలో స్థానం సంపాదించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. బుధవారం గొల్లపూడిలోని బీసీ భవన్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఆమె సందర్శించారు.

ఎంపికైన 100 మంది బీసీ అభ్యర్థులకు 43 రకాల అధునాతన స్టడీ మెటీరియల్‌ను మంత్రి అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐఏఎస్ అకాడమీ నిపుణులతో ఈ శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.ఏసీ తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ మరియు పౌష్టికాహారంతో కూడిన వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో త్వరలో రానున్న డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కూడా బీసీ అభ్యర్థులకు ఉచితంగా ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ కోచింగ్ అందజేస్తామని హామీ ఇచ్చారు. పాలనలో బీసీలు కీలక భూమిక పోషించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంకల్పంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media