AP:Kurnoolలో త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం

January 28, 2026 11:10 AM

కర్నూలు నగరంలోని అశోక్ నగర్‌లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. డ్రైనేజీ పనుల నిర్లక్ష్యం కారణంగా ఒక భారీ విద్యుత్ స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ భీకర దృశ్యాలు స్థానిక CC కెమెరాలో రికార్డవ్వగా, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఉదయం పూట ఒక విద్యార్థి స్కూలుకు వెళ్తుండగా విద్యుత్ స్తంభం అతనిపైకి కూలబోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో, ఆ బాలుడు అప్రమత్తమై వెనక్కి తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన డ్రైనేజీ కాలువ మరమ్మతులే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాలువ తవ్వకాల్లో స్తంభం పునాది బలహీనపడటంతో అది ఒక్కసారిగా విరిగిపడింది. విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ అధికారుల మధ్య కనీస సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ CCTV విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటనా స్థలం నుండి మరిన్ని వివరాలను మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media