TG:Kamareddyలో మెప్మా లోన్ రికవరీ రిసోర్స్ పర్సన్‌పై దాడి

January 31, 2026 4:37 PM

మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మెప్మా రిసోర్స్ పర్సన్ (RP)గా పనిచేస్తున్న చంద్రకళపై గుర్తుతెలియని వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలో పనిచేస్తున్న మెప్మా సిబ్బందిలో ఆందోళన కలిగిస్తోంది.

నిన్న రాత్రి బ్యాంకు మేనేజర్‌తో కలిసి చంద్రకళ అడ్లూరు గ్రామంలో లోన్ తీసుకున్న వారి ఇంటికి రికవరీ కోసం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, మార్గమధ్యలో దుండగులు ఆమెను అడ్డగించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రకళ ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రుణం తీసుకున్న వారే ఈ దాడికి పాల్పడి ఉంటారని బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చంద్రకళ భర్త నవీన్ దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే మెప్మా రిసోర్స్ పర్సన్లకు రక్షణ కల్పించాలని తోటి ఉద్యోగులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న దేవునిపల్లి పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media