2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా 9 సార్లు బడ్జెట్ సమర్పించి ఆమె రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో మొదటిసారి ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం.
1)మౌలిక సదుపాయాలకు పెద్దపీట: కేపెక్స్ (Capex) వ్యయాన్ని ₹12.2 లక్షల కోట్లకు పెంచారు. 7 కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. ఇందులో దక్షిణ భారత్‌కు వరంగా చెన్నై-బెంగళూరు-హైదరాబాద్ ‘హై-స్పీడ్ డైమండ్’ ప్రాజెక్ట్ నిలవనుంది.
2)ఆదాయపు పన్ను సంస్కరణలు: పన్ను స్లాబుల్లో మార్పులు చేయనప్పటికీ, ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానుంది. విదేశీ విద్య, వైద్యం కోసం పంపే నిధులపై TCS ను 5% నుండి 2%కి తగ్గించడం మధ్యతరగతికి ఊరట.
3)హైటెక్ విప్లవం: ‘సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0’ మరియు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీ (ECMS) కోసం ₹40,000 కోట్లు కేటాయించారు.
4)ఆరోగ్యం & సామాన్యం: 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. మొబైల్ ఫోన్లు, ఆప్టికల్ పరికరాలు చౌక కానున్నాయి.
5)మూడు కర్తవ్యాలే దిక్సూచి: ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
