KCRపై కక్ష సాధింపు ఆపాలి హనుమకొండలో BRSభారీ బైక్ ర్యాలీ

February 2, 2026 5:32 PM

BRS అధినేత, మాజీ CM కేసీఆర్ గారికి సిట్ (SIT) నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. హనుమకొండ జిల్లా అధ్యక్షులు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బాలసముద్రం నుండి ఎంజీఎం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.

కేసీఆర్ గారి ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. తెలంగాణ తెచ్చిన ధీరుడికి కేసులు, కోర్టులు కొత్త కాదని స్పష్టం చేశారు. సిట్ అధికారులు సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కి, చట్టవిరుద్ధంగా నోటీసులు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. వ్యక్తిగతంగా అందజేయాల్సిన నోటీసులను ఇష్టానుసారంగా ఇవ్వడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేక.. మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తోందని విమర్శించారు. పోలీసులతో జరిగిన తోపులాటలో దాస్యం వినయ్ భాస్కర్ గాయపడ్డారు. అనంతరం పోలీసులు ఆయనను మరియు పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసి మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎన్ని కుట్రలు చేసినా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, కేసీఆర్ గారిని మళ్లీ సీఎంను చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media