ఓరుగల్లులో కొలువైన చారిత్రాత్మక శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా లెజ్నెవా ఈరోజు ఉదయం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ధర్మకర్త తొనుపునూరి వీరన్న సాదర స్వాగతం పలికారు.
ముందుగా ఆదిశంకరాచార్యులను, వల్లభ గణపతిని దర్శించుకున్న ఆమె, అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం స్నపన మండపంలో ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజ శర్మ, వేద పండితులు అన్నా లెజ్నెవాకు మహదాశీర్వచనం అందజేశారు. ఆలయ మర్యాదలతో అమ్మవారి శేషవస్త్రాలను బహూకరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. డిప్యూటీ సీఎం సతీమణి రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
