ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన ‘ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్-2026’ విజేతల సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
CM చంద్రబాబు, Dycm పవన్ కళ్యాణ్‌లతో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై అధికారిక ప్రకటన చేస్తామని మంత్రి తెలిపారు. ఏపీని సినీ హబ్‌గా మార్చేందుకు ఏప్రిల్ నెల నుండి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.’మా-ఏపీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న ‘మహావృక్షం’ (చంద్రశేఖర్, విశాఖపట్నం), ద్వితీయ బహుమతి పొందిన ‘సింహాద్రి అప్పన్న’ (శ్రీనివాసరావు, శ్రీకాకుళం) చిత్ర బృందాలను మంత్రి సత్కరించారు. హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని సినీ రంగానికి కేంద్రబిందువుగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ పోటీల్లో సుమారు 203 లఘు చిత్రాలు పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు మంత్రి జ్ఞాపికలు మరియు నగదు బహుమతులను అందజేశారు.
