సిరిసిల్ల పోలీసులకు బండి సంజయ్ వార్నింగ్ మీరు చేసేది తప్పు

February 4, 2026 6:21 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తూ, బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు.

పోలీసులు చట్టప్రకారం కాకుండా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని హెచ్చరించారు.
తప్పు చేస్తున్న పోలీసుల పేర్లను తాము కూడా గమనిస్తున్నామని, సమయం వచ్చినప్పుడు చట్టపరంగా ప్రతి అధికారి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు.. కేవలం ప్రతిపక్షంపై ప్రతాపం చూపడం దారుణమన్నారు. గతంలో సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ అరాచకాలు జరిగాయని, ఇప్పుడు కూడా కొందరు అధికారులు అదే పంథాలో వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media