కృష్ణా జిల్లాలో నకిలీ నోట్ల ముఠా రూ. 6.2 లక్షల కరెన్సీ స్వాధీనం

February 5, 2026 10:23 AM

కృష్ణా జిల్లాలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.కృత్తివెన్ను మండలంలోని ఒక వైన్ షాపులో నిందితులు నకిలీ నోట్లను చలామణి చేసే ప్రయత్నం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 6.2 లక్షల నకిలీ నోట్లతో పాటు, వాటిని తయారు చేసేందుకు ఉపయోగించే ప్రింటర్లు, కటింగ్ మిషన్లు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వారిలో ఒకరు విశాఖపట్నం సమీపంలోని పెందుర్తికి చెందిన వారు కాగా, మరొకరు నర్సీపట్నం, ఇద్దరు కృత్తివెన్ను మండలానికి చెందిన వారు.నకిలీ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media