సత్యసాయి జిల్లా కదిరిలో పనిచేస్తున్న బీసీ సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి (ABCWO) గుర్రం బాలాజీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.పాత బిల్లుల మంజూరు విషయంలో వార్డెన్ లక్ష్మీనారాయణ నుండి బాలాజీ రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కదిరిలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి బాలాజీని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు బాలాజీ సొంత ఊరు రాయచోటి కావడంతో, అక్కడి కొత్తపేటలోని చలపతి వీధిలో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. ఇంటి తలుపులు మూసివేసి కీలక పత్రాల కోసం గాలింపు జరుపుతున్నారు.అధికారిక రికార్డులు, అక్రమ ఆస్తుల వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
