టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈరోజు (ఫిబ్రవరి 6, 2026) ఉదయం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేకువజామున జరిగిన అభిషేక సేవలో పాల్గొన్న ఆమె, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
మీనాక్షి చౌదరి అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకుని తన భక్తిని చాటుకున్నారు. మార్గమధ్యలో భక్తులతో నవ్వుతూ మాట్లాడుతూ, సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. సంక్రాంతికి విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో, స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఆమె విచ్చేసినట్లు సమాచారం.
.