AP:అన్నవరంలో వైభవంగా కోటి తులసి పత్రి పూజ ప్రారంభం

February 6, 2026 4:44 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నేడు (ఫిబ్రవరి 6, 2026) కోటి తులసి పత్రి పూజ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. లోకకల్యాణం, పాడిపంటల సమృద్ధిని కాంక్షిస్తూ ఆలయ వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఈ విశిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, కలశస్థాపనతో 60 మంది ఋత్వికులు ఈ పూజను ప్రారంభించారు. నేటి నుండి ఫిబ్రవరి 15 (మాఘ బహుళ త్రయోదశి) వరకు ప్రతి రోజూ ఉదయం 8:00 నుండి 11:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:00 నుండి 5:30 వరకు పూజలు జరుగుతాయి.

ఫిబ్రవరి 15న ఉదయం 8 గంటలకు రుద్రహోమంతో ఈ పూజలు ముగుస్తాయి. పూజా కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజూ లింగార్చన, సూర్యనమస్కారాలు, వేదపారాయణలు మరియు రాత్రి 7 గంటలకు మహా నివేదన, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించబడతాయి.సత్యదేవుని సన్నిధిలో జరుగుతున్న ఈ మహోత్తర కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media