AP:నర్సీపట్నంలో కిలేడీ ఇద్దరు దొంగల ముఠా అరెస్ట్

February 7, 2026 12:51 PM

ఆటోల్లో ప్రయాణికులలా నటిస్తూ తోటి ప్రయాణికుల నగలను కాజేస్తున్న ఇద్దరు దొంగలను నర్సీపట్నం టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

గత నెలలో దేవాడ త్రివేణి అనే మహిళ చోడవరం నుండి తిరిగి వచ్చి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఒక ఆటో ఎక్కారు. అదే ఆటోలో ప్రయాణికులలా కూర్చున్న గాడి సత్యవతి, షేక్ చాంద్ భాషా అనే వ్యక్తులు చాకచక్యంగా ఆమె బ్యాగులో ఉన్న 60 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీఐ షేక్ గఫూర్ బృందం దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి పట్టుకున్నారు. అపరిచిత వ్యక్తులతో కలిసి ఆటోల్లో ప్రయాణించేటప్పుడు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.నిందితుల నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media