విశాఖ జూకి చేరిన ‘కూర్మాపురం’ పులి రెస్క్యూ సెంటర్‌లో పర్యవేక్షణ

February 8, 2026 1:48 PM

తూర్పు గోదావరి జిల్లా ప్రజలను వారం రోజులుగా వణికించిన పెద్దపులి ఎట్టకేలకు విశాఖపట్నం చేరుకుంది. రాయవరం మండలం కూర్మాపురంలో శుక్రవారం సాయంత్రం అటవీ శాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి బంధించిన ఈ బెబ్బులిని, భారీ భద్రత నడుమ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (IGZP) లోని ఎనిమల్ రెస్క్యూ సెంటర్ (ARC) కి తరలించారు.

సుమారు 650 కిలోమీటర్ల మేర ప్రయాణించి అలసిపోయిన ఈ పులికి జూ వెటర్నరీ వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పులి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతానికి ఈ పులిని రెస్క్యూ సెంటర్‌లోని క్వారంటైన్ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. పులి గాయపడకుండా, ఒత్తిడికి లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పులి ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత, దానిని తిరిగి దట్టమైన అడవిలో విడిచిపెట్టాలా? లేదా జూలోనే ఉంచాలా? అనే అంశంపై నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) మార్గదర్శకాల మేరకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి వచ్చిన ఈ మగ పులి, తూర్పు గోదావరి జిల్లాలో ఎనిమిది పశువులను చంపి స్థానికులను భయాందోళనలకు గురిచేసిన విషయం విదితమే


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media