AP ఉర్దూ అకాడమీ ఉచితంగా “ఆవో ఉర్దూ సీఖే” కోచింగ్ క్యాంప్

April 28, 2026 4:48 PM

ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో “ఆవో ఉర్దూ సీఖే” పేరిట ఉచిత కోచింగ్ క్యాంప్ మే 1 నుంచి మే 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరియు ఎన్.ఎం.డి. ఫరూఖ్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఉర్దూను అందరూ నేర్చుకోవాల్సిన భాషగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.అదేవిధంగా, ఉర్దూ అకాడమీ లిటరరీ కమిటీ రూపొందించిన “రండి ఉర్దూ నేర్చుకుందాం” పుస్తకాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ గౌస్ పీర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బానీతో పాటు పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, ఉర్దూ ప్రేమికులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media