కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి

June 15, 2026 9:44 PM
abhijeet-deepke-slapped

‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఒక్కసారిగా చెంపపై కొట్టడంతో దీప్కే ఆత్మరక్షణ కోసం ప్రయత్నించారు.

నీట్ పేపర్ లీక్, దేశంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై సీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం జరుగుతుండగానే అభిజీత్ దీప్కేపై ఈ దాడి జరిగింది. ఆందోళన చేస్తున్న అభిజీత్‌ను ఓ గుంపు అడ్డుకుని దాడికి పాల్పడింది. అభిజీత్‌ పై దాడికి పాల్పడిన వారిని పట్టుకుని కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చితకబాదారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media