వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం? మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు!

April 9, 2026 7:50 PM

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముగిసి నేటికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ మరణంపై గతంలో వచ్చిన అనుమానాలు నేడు నిజమని నమ్మే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు కానీ, వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కానీ అత్యధికంగా లాభపడింది జగన్ ఒక్కరేనని ఆయన విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి కేవలం పదవి కోసం సైకో మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని, ఆ నైజం చూస్తుంటే నాడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

జగన్ నైజంపై విమర్శలు: జగన్ తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని అడిగినందుకు తన తల్లిని కూడా ఇంటి నుండి బయటకు పంపిన చరిత్ర కలిగిన వ్యక్తి అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిని జగన్ నాశనం చేశారని, ఇప్పుడు ‘మావిగన్’ (MAVIGUN) పేరుతో కొత్త రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పిచ్చిచేష్టలు ప్రజలందరికీ అర్థమైపోయాయని, ఆయనకు ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media