అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీ వల్ల వచ్చే సైబర్ ముప్పులపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా Anthropic సంస్థకు చెందిన “Mythos” వంటి మోడల్స్ సాఫ్ట్‌వేర్ లోపాలను గుర్తించి సైబర్ దాడులకు ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman మరియు ఐటీ మంత్రి Ashwini Vaishnaw ఆధ్వర్యంలో హై లెవల్ సమావేశం జరిగింది. ఈ ముప్పును “అపూర్వమైనది”గా అభివర్ణించిన సీతారామన్, బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.ఏవైనా సైబర్ ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే CERT-In కు సమాచారం ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఫిన్‌టెక్ రంగంలో ఏఐ వృద్ధికి సహకరిస్తున్నప్పటికీ, డేటా ప్రైవసీ మరియు భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
