విమాన వాష్‌రూమ్‌లో బీడీ తాగిన ప్రయాణికుడు.. కేసు నమోదు

March 11, 2026 12:17 PM

Delhi నుంచి Goaకు వెళ్తున్న AirAsia విమానంలో ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో బీడీ తాగిన ఘటన కలకలం రేపింది.

ఆశిష్ అనే ప్రయాణికుడు విమాన వాష్‌రూమ్‌లో బీడీ కాలుస్తుండగా ఎయిర్ హోస్టెస్ గమనించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.విమానంలోకి గ్యాస్ లైటర్‌తో ప్రయాణికుడు ఎలా ప్రవేశించాడన్న అంశం ఇప్పుడు భద్రతా పరంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media