నగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నగరంలో వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు డ్రైనేజీ మరియు వరద నీటి కాలువల (Storm Water Drains) మాస్టర్ ప్లాన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. విజయవాడలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల రక్షణ, మౌలిక వసతులు మరియు వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమ నియోజకవర్గంతో పాటు నగరవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సివిల్ పనులు, రహదారుల విస్తరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామమోహనరావు, బోడే ప్రసాద్‌లతో పాటు వీఎంసీ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
